Wednesday, March 4, 2026

కర్ణాటక సంగీతము (సంగీత సాధన)

కర్ణాటక సంగీతము (సంగీత సాధన)

వాగ్గేయకారుడు

వాగ్గేయకారుడంటే స్వయంగా రాసి,స్వయంగా సంగీతాన్ని సమకూర్చుకొని, స్వయంగా ప్రజల మధ్య అభినయిస్తూ పాట పాడే వాడు.

1.సరళీ స్వరాలు
2.జంట స్వరాలు
3.దాటు స్వరాలు
4.అలంకారములు
5.పిళ్ళారి గీతాలు
6.సాధరణ గీతాలు
7.స్వర పల్లవి
8.స్వర జతులు
9.తాన వర్ణములు
10.కీర్తనలు
11.పంచరత్నాలు

ప్రధాన అంశాలు
    • .1 శృతి
    • .2 స్వరం
    • .3 రాగం
    • .4 తాళం
    • శృతి

      శ్రుతి అంటే ధ్వని విశేషం. గీతానికి పనికి వచ్చే శ్రుతులు 22. వీనికి సిద్ధ, ప్రభావతి, కాంత, సుప్రభ, శిఖ, దీప్తిమతి, ఉగ్ర, హలది, నివ్రి, ధీర, క్షాంతి, విభూతి, మాలని, చపల వంటి పేర్లున్నాయి. పాశ్ఛాత్య సంగీతంలో 12 శ్రుతులతో సంగీత ఉచ్చస్థితి (అష్టమ స్వరం)కి చేరుకోగా భారతీయ సంగీతంలో 22 శ్రుతులతో తారాస్థాయి చేరుకుంటుంది. శృతి అనగా స్థాయిని సూచిస్తుంది. ఈ సంగీతంలో ఇతర అంశాలకు ఇది ప్రాథమిక భావన లాంటిది. . ఇది పాశ్చాత్య సంగీతంలోటానిక్ లేదా కీ కి దగ్గరగా ఉంటుంది. అష్టమ స్వరాల్లో స్థాయీ భేధాన్ని సూచించడానికి కూడా దీనిని వాడుతుంటారు. ఒక రాగంలో ఎన్నిరకాలైన స్థాయి భేదాలైనా ఉండవచ్చు కానీ సాధారణ మానవుని చెవి కేవలం ఇరవై రెండింటిని మాత్రమే గుర్తించగలదు. ఒక్కోసారి శ్రోత దృష్టిలో ఇది భావాన్ని కూడా సూచిస్తుంది.
      స్వరం
      ఈ సంగీతంలో , రి, , , , , ని అని సప్త స్వరాలు (ఏడు స్వరాలు) ఉంటాయి. ఇవి షడ్జమ, రిషభ,గాంధార, మధ్యమ, పంచమ, ధైవత, నిషధ అనే పొడవైన పేర్లకు సంక్షిప్త రూపాలు. ఈ సప్త స్వరాలను అనేక రీతులు తప్పని మేళవించడం వల్ల రాగాలు ఏర్పడతాయి. అయితే ఒక రాగంలో సప్త స్వరాలు తప్పని సరిగా ఉండాలన్న నియమం లేదు.ఇతర సంగీత ప్రక్రియల్లాగా కాకుండా ఈ ఏడింటిలో షడ్జమానికీ, పంచమానికీ, మధ్యమానికీ తప్ప మిగతా స్వరానికీ మూడు ఉప రీతులు ఉంటాయి. షడ్జమానికీ, పంచమానికీ ఒకే రీతి, మధ్యమానికీ రెండు ఉపరీతులూ ఉంటాయి.

      రాగం

      తాళం

      ఇది పాటతో పాటు మారదు. అన్ని పాటలకూ ఒకే విధంగా ఉంటుంది. కర్ణాట సంగీత కళాకారులు ముఖ్యంగా తమ చేతులనూ, వేళ్ళను పైకి, క్రిందకూ ఆడించడం ద్వారా దీన్ని అనుసరిస్తారు. హిందుస్థానీ సంగీతంలో తాళాన్ని పలికించడానికి, అనుసరించడానికి తబలాను ఉపయోగిస్తారు. కర్ణాటకసంగీతంలో అయితేమృదంగమును ఉపయోగిస్తారు. సప్త తాళములు మరియు అంగ లక్షణములు .
    • ప్రధాన వ్యాసం: స్వరాలు
    • వర్ణం

    • రాగ సంచారాన్ని "వర్ణం" వివరిస్తుంది. స్వర ఉచ్ఛారనణ ను, రాగ లక్షణాన్ని, రాగ అవరోహణ, ఆరోహణ క్రమాన్ని కూడా వర్ణం వివరిస్తుంది. వర్ణాల్లో చాలా రకములు ఉన్నాయి. పల్లవి, అను పల్లవి, ముక్థాయి స్వరాలు, చరణం, మరియు చిత్త స్వరాలు వర్ణానికి సర్వ సాధారణం. వివిధ గతుల్లో అభ్యాసం చేయటానికి వీలుగా వీటిని రచించారు.సాధారణంగా గాత్ర కచేరీల్లో శ్రోతలను మురిపించటానికి వర్ణ ఆలాపనతో గాయకులు కార్యక్రమాన్ని ఆరంభిస్తారు.

    • కృతి

      • పల్లవి
      • అనుపల్లవి
      • చరణం
    • కృతిలో మూడు ప్రధాన భాగాలుంటాయి.

    • తాళం
    • ఇది పాటతో పాటు మారదు. అన్ని పాటలకూ ఒకే విధంగా ఉంటుంది. కర్ణాట సంగీత కళాకారులు ముఖ్యంగా తమ చేతులనూ, వేళ్ళను పైకి, క్రిందకూ ఆడించడం ద్వారా దీన్ని అనుసరిస్తారు. హిందుస్థానీ సంగీతంలో తాళాన్ని పలికించడానికి, అనుసరించడానికి తబలాను ఉపయోగిస్తారు. కర్ణాటకసంగీతంలో అయితేమృదంగమును ఉపయోగిస్తారు. సప్త తాళములు మరియు అంగ లక్షణములు .
      1. ధృవ తాళం ( 1 0 1 1 )
      2. మత్య తాళం ( 1 0 1 )
      3. రూపక తాళం ( 0 1 )
      4. ఝంపె తాళం ( 1 U 0 )
      5. త్రిపుట తాళం ( 1 0 0 )
      6. ఆట తాళం ( 1 1 0 0 )
      7. ఏక తాళం ( 1 )
      8. వైదిక యజ్ఞాల్లో,ఋగ్వేద సామవేద మంత్రాల్లో ఉచ్చరింపబడే కొన్ని సంగీత స్వరాలు ,భారతీయ శాస్త్రీయ సంగీతానికి పునాదిరాళ్ళ వంటివని చెబుతారు. వీణ గాత్రానికి పక్క వాయిద్యమని, యజుర్వేదంలోచెప్పబడింది. రామాయణ,భారతాల్లో కూడా శాస్త్రీయ సంగీతానికి సంబంధించిన ప్రస్తావనలు ఉన్నాయి. యాజ్ఞవల్క్య స్మృతి లో చెప్పబడినట్లు, "

    • భారతీయ సంగీతము లో కొన్ని స్వరాల సమూహము రాగం. రాగమనగా, స్వరవర్ణములచే అలంకరింబడి, జనుల చిత్తమును ఆనందింపచేయునట్టి ధ్వని.

      మాల్కోసా రాగం-రాగమాల సీరిస్ లోని ఒక దృశ్యం
      రాగ సృష్టి సంగీత ప్రపంచానికి భారతదేశం అందించిన గొప్ప కానుకగా భావిస్తారు. రాగాలకు సంబంధించిన మూల భావాలు సామవేదంలో ఉన్నట్లు సంగీతకోవిదులు చెబుతారు. మన సంప్రదాయ సంగీతములోని రెండు స్రవంతులకు కూడా రాగమే అధారం. రాగమేళకర్త ప్రణాళికననుసరించి రాగాలను 12 రాశులు లేదా సముహాలుగా వర్గీకరిస్తారు. ఒక్కొక్క సమూహాంలో ఆరు రాగాలు వరకు ఉంటాయి. వానిని జనక రాగాలు అంటారు. అనేక జన్యరాగాలకు ఆధారం జనకరాగాలే.ఈ రాగాలకు రూప కల్పన చేసిన వారు వేంకటమహి. హిందుస్థానీ సంగీతంలో కూడ ఈ 72 రాగాలలో ఓ పదింటిని విస్తృతంగా వాడతారని పరిశీలకుల భావన. 72 రాగాలకు ధీర శంకరాభారణం, కీరవాణి, నట భైరవి, గౌరీ మనోహరి వంటి ప్రత్యకనామాలున్నాయి. హిందుస్తానీ, కర్ణాటక సంగీతాలు ఒకే సంప్రదాయం నుండి పుట్టినప్పటికీ వానిని ఆలపించడంలోను, సాధన చేయడంలోను ఎంతో వైరుధ్యం ఉంది. భాషాపరమైన ప్రాంతీయమైన, సాంకేతికమైన, సామాజిక రాజకీయ కారణాలు ఈ వైరుధ్యానికి హేతువులని అంటారు.

      విషయ సూచిక

      • 1 రాగాలు-రకాలు
        • 1.1 జనక రాగాలు
      • 2 12 చక్రాలు
        • 2.1 జన్య రాగాలు
      • 3 రాగాల సంఖ్య
      • 4 మూలాలు
      • 5 ఇతర లింకులు

      రాగాలు-రకాలు

      ఆరోహణ, అవరోహణలను బట్టి రాగాలను రెండుగా విభజించారు.

      జనక రాగాలు

      జనక రాగాలను మేళకర్త రాగాలు, సంపూర్ణ రాగాలు అంటారు. ఇవి 72 ఉన్నాయి. వీటి లక్షణాలు:
      • ఆరోహణ, అవరోహణలలో సప్తస్వరాలు ఉంటాయి.
      • ఆరోహణ, అవరోహణలోని సప్తస్వరాలు క్రమ పద్ధతిలో వరుస మారకుండా ఉంటాయి.
      • ఆరోహణలో ఏఏ అంతర గాంధారాది క్రమం ఉంటే, అవరోహణలో కూడా అదే క్రమం ఉంటుంది.
      ఈ 72 జనక రాగాలను రెండు భాగాలుగా విభజించారు. వీటిలో మొదటి 36 రాగాలకు శుద్ధ మధ్యమం ఉన్నందువలన, ఈ పూర్వ మేళ రాగాలను 'శుద్ధ మధ్యమ రాగాలు' అంటారు. తరువాత 36 రాగాలకు ప్రతి మధ్యమం ఉన్నందువలన ఈ ఉత్తర మేళ రాగాలను 'ప్రతి మధ్యమ రాగాలు' అంటారు.

      12 చక్రాలు

      పూర్వ, ప్రతి మధ్యమ రాగాలలో ఒక్కొక్క విభాగాన్ని ఆరు సూక్ష్మ విభాగాలుగా చేసి, 12 భాగాలు ఏర్పరచారు. వీటిని 'చక్రములు' అంటారు. ఒక్కొక్క చక్రంలో ఆరు రాగాలు ఉండేలా విభజన చేశారు. ఈ పన్నెండు చక్రాల పేర్లు:
      • 1. ఇందు చక్రం : కనకాంగి, రత్నాంగి, గానమూర్తి, వనస్పతి, మానవతి మరియు తానరూపి రాగాలు.
      • 2. నేత్ర చక్రం : సేనాపతి, హనుమతోడి, ధేనుక, నాటకప్రియ, కోకిలప్రియ మరియు రూపవతి రాగాలు.
      • 3. అగ్ని చక్రం : గాయకప్రియం, వకుళాభరణం, మాయామాళవగౌళ, చక్రవాకం, సూర్యకాంతం మరియు హాటకాంబరి రాగాలు.
      • 4. వేద చక్రం : ఝుంకారధ్వని, నటభైరవి, కీరవాణి, ఖరహరప్రియ, గౌరీమనోహరి మరియు వరుణప్రియ రాగాలు.
      • 5. బాణ చక్రం : మారరంజని, చారుకేశి, సరసాంగి, హరికాంభోజి, ధీరశంకరాభరణం మరియు నాగానందిని రాగాలు.
      • 6. ఋతు చక్రం : యాగప్రియ, రాగవర్ధిని, గాంగేయభూషిణి, వాగధీశ్వరి, శూలిని మరియు చలనాట రాగాలు.
      • 7. ఋషి చక్రం : సాలగం, జలార్ణవం, ఝాలవరాళి, నవనీతం, పావని మరియు రఘుప్రియ రాగాలు.
      • 8. వసు చక్రం : గవాంబోధి, భవప్రియ, శుభపంతువరాళి, షడ్వితమార్గిణి, సువర్ణాంగి మరియు దివ్యమణి రాగాలు.
      • 9. బ్రహ్మ చక్రం : ధనళాంబరి, నామనారాయణ, కామవర్ధిని, రామప్రియ, గమనశ్రమ మరియు విశ్వంభరి రాగాలు.
      • 10. దిశ చక్రం : శ్యామలాంగి, షణ్ముఖప్రియ, సింహేంద్రమధ్యమ, హేమవతి, ధర్మవతి మరియు నీతిమతి రాగాలు.
      • 11. రుద్ర చక్రం : కాంతామణి, రిషభప్రియ, లతాంగి, వాచస్పతి, మేచకళ్యాణి మరియు చిత్రాంబరి రాగాలు.
      • 12. ఆదిత్య చక్రం : సుచరిత్ర, జ్యోతిస్వరూపిణి, ధాతువర్ధిని, నాసికాభూషణి, కోసలము మరియు రసికప్రియ రాగాలు.

      జన్య రాగాలు

      మేళకర్త రాగాల నుండి పుట్టినవి ఈ జన్య రాగాలు. వీటిని స్వరభేదం చేత వివిధ రాగాలుగా విభజించారు.
      • ఉపాంగ రాగాలు : ఇది 15వ మేళకర్త రాగమైన మాయామాళవ గౌళ రాగం యొక్క జన్యం. ఉదాహరణ - సావేరి, మలహరి రాగాలు.
      • భాషాంగ రాగాలు : ఇది నటభైరవి అనే 20 మేళకర్త రాగం యొక్క జన్యం. ఉదాహరణ - భైరవి, ఆనందభైరవి రాగాలు.
      • వర్జ రాగాలు : ఉదాహరణ - శ్రీరంజని, మోహన, శుద్ధ సావేరి రాగాలు.
      • వక్ర రాగాలు : రాగంలో స్వరాల అమరిక క్రమ పద్ధతిలో ఉండకపోవడమే వక్ర రాగ లక్షణం. ఉదాహరణ - ఆనంద భైరవి, సారంగ, శహన రాగాలు.
      • నిషాదాంత్య రాగాలు : కొన్ని రాగాలు నిషాదంతో అంతమవుతాయి. అటువంటి రాగాలు తారాస్థాయిని చేరుకోవు. ఉదాహరణ - నాదనామ క్రియ రాగం.
      • పంచమాంత్య రాగాలు : కొన్ని రాగాలు మధ్యస్థాయి పంచమంతో అంతమవుతాయి. ఉదాహరణ - నవరోజు రాగం.
      • దైవతాంత్య రాగాలు : కొన్ని రాగాలు మధ్యస్థాయి దైవతంలో అంతమవుతాయి. ఉదాహరణ - కురంజి రాగం.

      రాగాల సంఖ్య

      ఒక జనకరాగం నుంచి పైన చెప్పిన లక్షణాలను పాటిస్తూ దాదాపుగా 483 జన్య రాగాలు పుట్టవచ్చు. ఇలా 72 మేళకర్తల నుంచి 34, 847 వర్జ్యరాగాలు పుట్టే అవకాశం ఉంది. ఇక వక్రరాగాలు, భాషాంగరాగాలు లెక్కించుకుంటూ పోతే వాటికి అంతే ఉండదు. అందుకే రాగాలు అనంతాలంటారు.