- మేళకర్త రాగాలు- విభజన
కర్ణాటక సంగీతం: 72 మేళకర్త రాగాలు – విభజన కర్నాటక సంగీతంలో 72 మేళకర్త రాగాలు ఉన్నాయి. మొదటి 36 రాగాలు శుద్ధమధ్యమ రాగాలు (క్రమసంఖ్య 1 నుండి 36)గా, మిగతా 36 రాగాలు ప్రతిమధ్యమ రాగాలు (క్రమసంఖ్య 37 నుండి 72)గా విభజించబడ్డాయి. ఈ 72 రాగాలను 12 చక్రాలుగా విభజించి, ప్రతి చక్రానికి గుర్తుంచుకునేలా ప్రత్యేక నామం పెట్టారు. 12 చక్రాలు మరియు వాటి రాగాలు ఇందు చక్రం: కనకాంగి, రత్నాంగి, గానమూర్తి, వనస్పతి, మానవతి, తానరూపి నేత్ర చక్రం: సేనాపతి, హనుమతోడి, ధేనుక, నాటకప్రియ, కోకిలప్రియ, రూపవతి అగ్ని చక్రం: గాయకప్రియం, వకుళాభరణం, మాయామాళవగౌళ, చక్రవాకం, సూర్యకాంతం, హాటకాంబరి వేద చక్రం: ఝుంకారధ్వని, నటభైరవి, కీరవాణి, ఖరహరప్రియ, గౌరీమనోహరి, వరుణప్రియ బాణ చక్రం: మారరంజని, చారుకేశి, సరసాంగి, హరికాంభోజి, ధీరశంకరాభరణం, నాగానందిని ఋతు చక్రం: యాగప్రియ, రాగవర్ధిని, గాంగేయభూషిణి, వాగధీశ్వరి, శూలిని, చలనాట ఋషి చక్రం: సాలగం, జలార్ణవం, ఝాలవరాళి, నవనీతం, పావని, రఘుప్రియ వసు చక్రం: గవాంబోధి, భవప్రియ, శుభపంతువరాళి, షడ్వితమార్గిణి, సువర్ణాంగి, దివ్యమణి బ్రహ్మ చక్రం: ధనళాంబరి, నామనారాయణ, ...