06.తారక మంత్రము భక్త రామదాసు

తారక మంత్రము కోరిన దొరికెను

ధన్యుడ నైతిని ఓ రన్నా ||తారక మంత్రము||


మీరిన కాలుని దూతల పాలిటి

మృత్యువు యని నమ్మకయున్న ||తారక మంత్రము||


మచ్చికతో నితరాంతరమ్ముల

మాయలలో పడబోకన్నా

హెచ్చుగ నూట యెనిమిది తిరుపతు

లెలమి తిరుగ పనిలేదన్నా ||తారక మంత్రము||


ముచ్చటగా తా పుణ్యనదులలో

మునుగుట పని ఏమిటికన్నా

వచ్చెడి పరువపు దినములలో

సుడి వడుటలు మానకయున్న ||తారక మంత్రము||


ఎన్ని జన్మముల ఎరుకతో జూచిన

ఏకో నారాయణుడన్న

అన్ని రూపులై యున్న పరాత్పరు

నా మహాత్ముని కథ విన్నా ||తారక మంత్రము||


ఎన్ని జన్మముల ఎరుకతో జూచిన

యీ జన్మముతో విడునన్నా

అన్నిటి కిది కడసారి జన్మము

సత్యంబిక పుట్టుట సున్నా ||తారక మంత్రము||


నిర్మల అంతర్లక్ష్య భావమున

నిత్యానందముతో నున్న

కర్మంబులు విడి మోక్ష పద్ధతిని

కన్నులనే జూచుచునున్న ||తారక మంత్రము||


ధర్మము తప్పక భద్రాద్రీశుని

తన మదిలో నమ్ముకయున్న

మర్మము తెలిసిన రామదాసు హృ

న్మందిరమున నే యున్న ||తారక మంత్రము||

No comments:

నాకు నచ్చిన పాటలు

 🎵 జీవితమే సఫలము - చిత్రం: అనార్కలి Yeh Zindagi Usiki Hai (Part 1) – పూర్తి అర్థం (తెలుగులో) పాట: Yeh Zindagi Usiki Hai (Part 1) సినిమా: An...