06.త్యాగరాజ కీర్తన

గంధము పూయరుగా
పన్నీరు గంధము పూయరుగా
అందమైన యదునందుని పైని
కుందరదనవర వందగ పరిమళ "గంధము"

తిలకము దిద్దరుగా
కస్తూరి తిలకము దిద్దరుగా
కళకళమని ముఖకళగని సొక్కుచు
పలుకుల నమృతము నొలెకిడి స్వామికి "తిలకము"

చేలము గట్టరుగా
బంగారు చేలము గట్టరుగా
మాలిమితో గోపాల బాలులతో
నాల మేపిన విశాల నయనునికి "చేలము"

ఆరతులెత్తరుగా
ముత్యాల ఆరతులెత్తరుగా
నారీమణులకు వారము యవ్వన
వారక యొసగెడి వారిజాక్షునికి "హారతులు"

పూజలు చేయరుగా
మనసారా పూజలు చేయరుగా
జాజులు మరివిర జాజుల దవనము
రాజిత త్యాగరాజ వినుతునికి "పూజలు"

No comments:

🎼 తెలుగు కళా–సంగీత–సినీ రంగాల మహనీయులు సంగీతం • గానం • నటన • హాస్యం • బహుముఖ ప్రజ్ఞ తెలుగు కళా–సంగీత–సినీ రంగాల చరిత్రలో అనేకమంది...